PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్థిక క్రమశిక్షణ… పురోగతికి తొలిమెట్టు

1 min read

శ్రీ జితేందర్ సింగ్ ,  హెచ్ ఆర్ మేనేజర్ , కాగ్నిజెంట్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:       స్థానిక జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ శ్రీ జితేందర్ సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన తన స్నాతకోత్సవ ఉపన్యాసంలో డిగ్రీ పట్టా తీసుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ సాంకేతిక రంగం ఎటు పయనిస్తుందో అటువైపు మీ ఆలోచనలు మల్లాలని, వచ్చిన అవకాశాలను అన్నింటిని అందిపుచ్చుకోవాలని తెలియజేశారు నైపుణ్యము కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు అన్నీ నిరంతరం వెతుకులాడుతున్నాయని గుర్తు చేశారు. మన మేధస్సును , మేధావులను కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయన్నారు.కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు శ్రీ జి. పుల్లయ్య  మాట్లాడుతూ కళాశాలలో చేరినప్పుడు తల్లిదండ్రుల చాటు బిడ్డలుగా వచ్చి నేడు తల్లిదండ్రుల ముందు గర్వంగా డిగ్రీ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు తన ఆశీస్సులు తెలిపారు. ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మిమ్ములను ముందుకు నడిపిస్తుందన్నారు. కళాశాల చైర్మన్ శ్రీ జి వి యం మోహన్ కుమార్ డిగ్రీ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సామాజిక బాధ్యతను గుర్తించుకోవాలని చెప్పారు .అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శ్రీనివాసరావు తన ఉపన్యాసంలో ఈ సంవత్సరం చివరి సంవత్సరం చదివిన విద్యార్థులలో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టాలు తీసుకున్నారని చెప్పారు. అనంతరం బ్రాంచీల వారిగా టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు .ఈ కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ ఎన్. విశాలి, శ్రీ జి. గోపీనాథ్, శ్రీ జి. వంశీధర్, డాక్టర్ ఎం.గిరిధర్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీలక్ష్మి ,కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ జి. శశికుమార్ ,కళాశాల డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author