ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు సత్వరమే చెల్లించాలి… ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నెల్లూరు జిల్లా అభ్యాసవర్గ ఈరోజు వింజమూరు నందు గోనుగుంట రామయ్య కళ్యాణమండపం నందు జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ బాలాజీ , రాష్ట్ర సంఘటనా కార్యదర్శి సీహెచ్. శ్రావణ కుమార్ , రాష్ట్ర సహాధ్యక్షులు చక్రపాణి , రాష్ట్ర కార్యదర్శి పి. వెంగయ్య, జిల్లా అధ్యక్షులు శ్రీ రాజగోపాలాచారి , జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పి.అనీల్ కుమార్ , ఆర్థిక కార్యదర్శి మణికందరచారి పలువురు జిల్లా బాధ్యులు పాల్గొని ఆపస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఆపస్ బాధ్యులు 120 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం లో డీఈఓ పూల్ లోని పండితుల అప్ గ్రెడేషన్, ఏపిజిఎల్ఐ సమస్యలు, పీఎఫ్ సమస్యలు, ఉపాధ్యాయుల భర్తీ, 2003 DSc ఉపాధ్యాయులకు పాత ఫించన్ విధానం, 12 సం” పూర్తి చేసిన SGT ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ హోదా, పదోన్నతులు, మెగా డీఎస్సీ మొదలైన సమస్యలపై వెంటనే స్పందించాలని, ఈనెల 28 లోపు బదిలీలపై యాక్ట్ చేయుటకు కమిషనరేట్ నుంచి సూచనలు కోరారని అది త్వరగా అందజేయాలని తీర్మానించడం అయినది. ఈ సందర్భంగా ఫెసిలిటేషన్ సెంటర్ ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినందున బ్యాలెట్ లో తప్పు ఉంటేనే తిరస్కరించాలని లేదంటే లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది.