PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు ఆర్థిక భరోసా. .వారి ఆరోగ్య రక్షణ పై ప్రత్యేక పథకం..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;

కెనరా బ్యాంక్ డైరెక్టర్ అశోక్ చంద్ర..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్ :  ఓర్వకల్లు బాలభారతి పాఠశాలలో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళ స్వయం సహాయక సంఘాల  చేయూత కార్యక్రమం… నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెనరా బ్యాంక్ డైరెక్టర్ అశోక్ చంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమం మహిళ సమైక్య సంఘం గౌరవ సలహాదారులు విజయ భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ డైరెక్టర్ మాట్లాడుతూ. కెనరా ఏంజెల్ పథకం మహిళలకు వరం,క్యాన్సర్ కేర్ ద్వారా మహిళలకు రూ 10 లక్షల వరకు బీమా వర్తిస్తుందని దేశవ్యాప్తంగా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్న తమ బ్యాంకు ద్వారా ఆర్థిక భరోసానే కాకుండా మహిళలకు ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు దాదాపు 3 లక్షల వరకు ప్రత్యేక వైద్య సదుపాయం ఉచితంగా ఉంటుందన్నారు.పొదుపు మహిళలకు కెనరా బ్యాంకు ద్వారా అత్యధికంగా రుణాల మంజూరు,కెనరా బ్యాంక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…మహిళా  సమైక్య సంఘం గౌరవ సలహాదారులు విజయభారతి..

మాట్లాడుతూ 1995లో గడప దాటని మహిళలకు పొదుపు మంత్రాన్ని నేర్పించి ఇక్కడ నుంచి దాదాపు 11 వేల మంది పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదం చేశామని దేశంలో ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఓర్వకల్ మహిళా మణులు ప్రత్యేక ఏంజెల్ పథకాన్ని కెనరా బ్యాంకు ద్వారా అందిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పొదుపు సమాఖ్య సభ్యులు మహిళలు కెనరా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About Author