భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి వేడుకలు
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: ఏడాదిలో వచ్చే 24ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనినే శయనేకాదశి అని, హరివాసరమని, పేలాల పండుగని పిలుస్తారు. బుధవారం తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా మండలంలోని శైవక్షేత్రాలు భక్తులతో మారుమ్రోగిపోయాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు వంటి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. మరుసటి రోజు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి అని వేదాంతులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మండలంలోని ఆలయాలు కిక్కరిసి పోయాయి. బిలకల గూడూరు సమీపాన జిందాల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిందాల్ యజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది .దుర్గ భోగేశ్వర ఆలయంలో ఈశ్వరుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి శ్యామ్ సదర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి కుంకుమార్చన ఆకు పూజ నిర్వహించారు .