సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటాం… మత్స్యకారులు
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటామని మత్స్యకారులు అన్నారు. శుక్రవారం నాడు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఆదేశాల మేరకు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద జీవో 217 రద్దును హర్షిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూవైసిపి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తీసుకువచ్చిన జీవో నం.217 ను రద్దు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ధన్యవాదాలు తెలుపుతూ, వెలుగోడు పార్టీ కార్యాలయం నందు మత్స్యకారులు పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు చిత్రపటానికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 217 జీవోతో మత్స్యకారులను తమ జీవన భృతిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కల్పించే జీవోను చంద్రబాబు నాయుడు రద్దు చేయడాన్ని తామంతా హర్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు అన్నారపు శేషి రెడ్డి , పట్టణ అధ్యక్షులు ఖలీల్ ఖాన్, హి దాయత్ అలీ ఖాన్, మోమిన్ రసూల్, తెలుగు బుడ్డన్న, తెలుగు రమణ, తెలుగు రామాంజనేయులు, తెలుగు మధు, జయరాం, తెలుగు సంఘం నాయకులు, బియ్యం మూర్తిజ, జనసేన పార్టీ నాయకులు షాలుబాషా, చిన్న వలి తదితరులు పాల్గొన్నారు.