PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి

1 min read

48 మంది మత్స్యకార సొసైటీ సభ్యులకు కిసాన్ క్రెడిట్ లోన్ల ద్వారా రూ.12.85 లక్షల మెగా చెక్కు అందజేసిన జాయింట్ కలెక్టర్

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

పల్లెవెలుగు వెబ్  కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పేర్కొన్నారు.గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్యామల, మత్స్యకార సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులకు కెనరా బ్యాంకు వారి సహకారంతో కిసాన్ క్రెడిట్ లోన్ల రూపంలో 48 మంది మత్స్యకార కో-ఆపరేటివ్ సభ్యులకు రూ.12.85 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. ఈ రుణాల ద్వారా మత్స్యకారులు ఎవ్వరీ మీద ఆధారపడకుండా వారి జీవనఉపాధికి ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా మిగితా బ్యాంకులు కూడా మత్స్యకార సంఘాలకు రుణాలు అందజేసేందుకు ముందుకు రావాలని కోరారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మంచి మార్కెటింగ్ సేవలు కూడా అందజేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. మహిళలు కూడా కో-ఆపరేటివ్ సంఘాలుగా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను వచ్చే అవకాశం ఉంటుందని అందుకు జిల్లా కలెక్టర్ కూడా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.అనంతరం 48 మంది మత్స్యకార కో-ఆపరేటివ్ సభ్యులకు కెనరా బ్యాంకు ద్వారా కిసాన్ క్రెడిట్ లోన్ల ద్వారా రూ.12.85 లక్షల మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ మత్స్యకార కో-ఆపరేటివ్ సభ్యులకు అందజేశారు.అనంతరం మత్స్యకార సొసైటీ సభ్యులు, రైతులు జాయింట్ కలెక్టర్ ను శాలువ, పుష్పగుచ్చం అందజేశారు.జిల్లాలో ఉత్తమ మహిళా కో-ఆపరేటివ్ సభ్యులుగా రాణిస్తున్న బెస్త సునీతమ్మ, ఉత్తమ మార్కెటింగ్ చేస్తున్న కౌసల్యను జాయింట్ కలెక్టర్, మత్స్య శాఖ అధికారి చేతుల మీదుగా మోమెంటో, శాలువతో సత్కరించారు.అదే విధంగా విజయవాడ తుమ్మల కళాక్షేత్రంలో జరిగే రాష్ట్ర స్థాయిలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో త్రీ వీలర్ మీద చేప ఉత్పత్తులను విక్రయించే భారతి అనే మహిళ ఎంపిక కావడం జరిగిందని వారిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కరించడం జరుగుతుందన్నారు.సభ్యులను, ఆక్వా రైతులను శాలువతో జిల్లా మత్స్య శాఖ అధికారి సత్కరించారు.కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్యామల, కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, డిసిఓ రామాంజనేయులు, సహాయ సంచాలకులు సంధ్యారాణి, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ శేఖర్, మత్స్య సొసైటీ సభ్యులు, మహిళ మార్కెటింగ్ మత్స్యకార సభ్యులు, ఆక్వా రైతులు, రైతులు, ఎఫ్పిఓలు, మత్స్యకార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *