ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఐదుగురు ఎంపిక
1 min readనియామక పత్రాలు అందజేసిన మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన 5 గురు సభ్యులకు శనివారం ఉదయం మేయర్ నూర్జహాన్ పెదబాబు పత్రాలను అందజేశారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆశీస్సులతో ఏలూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 42 వ డివిజన్ కార్పొరేటర్ అర్జీ సత్యవతి నాగేశ్వరరావు,29వ డివిజన్ కార్పొరేటర్ ఉచ్చుల సుజాత సన్నీ,25వ డివిజన్ కార్పొరేటర్ గునుపూడి శ్రీనివాసరావు,14వ డివిజన్ కార్పొరేటర్ దారపు అనుషాతేజ,9వ డివిజన్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.ఎన్నికైన వారికి మేయర్ చాంబర్లో పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు బడేటి చంటి వారి సూచనలు,సలహాలు తీసుకొని నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పాలకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా నగర అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.నగర్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్, మాట్లాడుతూ సంక్రాంతి నాటికి గుంతలు లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీడిప్యూటీ మేయర్,కో-ఆప్షన్ సభ్యులుచోడే వెంకటరత్నం మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేటర్లకు ఈ సంవత్సరం ఐదుగురు సభ్యులకు అవకాశం ఇచ్చారని,సెకండ్ టర్మ్ లో మరో ఐదుగురు సభ్యులకు అవకాశం ఇచ్చి అందరికీ న్యాయం చేస్తారన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబును శాలువాకప్పి,బొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాము శామ్యూల్,తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి రెడ్డి నాగరాజు,మల్లెపురము తదితరులు పాల్గొన్నారు.