నిమజ్జనం సందర్భంగా.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్
1 min readవినాయక నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఫ్లాగ్ మార్చ్
ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వై వి రమణ, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ , ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది మహిళా సిబ్బందితో కలిసి ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ ను నిర్వహించినారు.ఈ సందర్భంగా ఏలూరు డిఎస్పి మాట్లాడుతూ ప్రజలు మతసామరస్యాన్ని పెంపొందించుకుంటూ వారి వారి యొక్క మత ర్యాలీలను నిర్వహించుకోవాలని ఒకరి మతం పట్ల ఎటువంటి ద్వేష భావం లేకుండా ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా పండగలను నిర్వహించుకోవాలని సూచించారు.వినాయక నిమజ్జనం చేసే ప్రాంతాలలో రక్షణ కొరకు బారి కేడు లను ఏర్పాటు చేసినట్లు,నిమజ్జనం చేసే సమయాలలో చిన్న పిల్లలను ర్యాలీలో పాల్గొనకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు చూసుకోనీ అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణంలో ఎటువంటి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రహదారు లలో వాహనాలను మళ్లించినట్లు ఊరేగింపులలో బాణ సంచాను కాల్చరాదని, ఊరేగింపులలో అశ్లీల నృత్యాలను అనుమతించ రాదన్నారు. అని ప్రశాంతమైన వాతావరణంలో పండగలను జరుపుకొనుటకు పోలీసు వారు విధించే ఆంక్షలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు వారికి సహకరించాలన్నరు. అందరూ ఐకమత్యంగా సంతోషంగా ఈ పండుగను కొనసాగించాలని ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ తెలియచేశారు.