PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాపారస్ధులు, ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఆహార భధ్రత నియమాలను పాటించాలి

1 min read

ఆహార సంబంధిత 13 కేసుల్లో రూ.1.15 లక్షల జరిమాన విధింపు

జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆహార సంబంధిత వ్యాపారస్తులు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి చెప్పారు.  ఆహార సంబంధిత కేసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ కోర్డునందు విచారణ జరిగింది.  ఈ సందర్బంగా 13 ఆహార సంబంధిత కేసులను విచారించారు.  ఇందుకు సంబంధించి ముద్దాయిలకు 1,15,510 రూపాయలు జరిమాన విధించారు.  ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భధ్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.  ఈవిషయంలో నియమాలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని అటువంటి వారిపై కేసులను నమోదుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Author