గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
1 min readదాకోజు జ్యువెలర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు
విచ్చేసిన పరువులు కార్పొరేటర్లు, స్నేహితులు బంధుమిత్రులు
సేవాగుణం కలిగిన గొప్ప వ్యక్తి దాకోజు ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అన్ని దానాల కన్నా అన్నదానంమిన్నని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. గురుపౌర్ణమి పురస్కరించుకొని స్థానిక 12వ డివిజన్ గడియార స్తంభం మేడబడి వద్ద ఉన్న దాకోజు ప్రసాద్ జ్యూయలరీ షాప్ వద్ద ఆయన (ఆధ్వర్యంలో)శ్రీ షిరిడి సాయిబాబా వారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి పలువురికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు నగరపాలకసంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సేవా దృక్పథం, దాతృత్వం కలిగిన మనసున్న మంచి వ్యక్తి దాకోజు ప్రసాద్ అని కొనియాడారు. అయ్యప్పస్వామి పై ఉన్న భక్తితో గత 40 సంవత్సరాలుగా మకర సంక్రాంతి రోజు శబరిమలలో ప్రతి సంవత్సరం ప్రసాద్ సారధ్యంలో అన్నదాన కార్యక్రమం. జరుగుతుందన్నారు. అదేవిధంగా శ్రీ షిరిడి సాయిబాబా బాబా వారిపై ఉన్న భక్తితో గురుపౌర్ణమి పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయం. ఆయన సేవ గుణం కలిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన కుటుంబాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భగవంతుడు చల్లగా చూడాలన్నరు.ఈ కార్యక్రమంలో 12 వ డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు మరియు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, బత్తిన విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు,ఈదుపల్లి పవన్, నున్న కిషోర్, ఇనపనూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.