PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారాన్ని అందించాల్సిందే..

1 min read

ప్రతిరోజు ఆహారపదార్థాలను ప్రధానోపాధ్యాయులు పరిశీలించిన తరవాతే పిల్లలకు పెట్టాలి

మధ్యాహ్నం భోజన పధకంలో మెనూ సక్రమంగా నిర్వహించాలి

ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్ధ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలన

విద్యార్ధినులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మధ్యాహ్నం భోజన పధకం ఆహార పదార్థాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించిన తరవాతే పిల్లలకు పెట్టాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు.  స్ధానిక ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్ధ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజన పధకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విద్యార్ధినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను జేసి పరిశీలించారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలో మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్ధులకు అందించేందుకు ప్రతిరోజు మెనూను నిర్ధేశించిందని, మెనూ ప్రకారంగా తప్పనిసరిగా ఆహారాన్ని అందించాల్సిందేనని ఈవిషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోనన్నారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు తప్పనిసరిగా మెనూను పరిశీలించాలని, భోజన నాణ్యత పరిశీలించిన  తరవాతే పిల్లలకు పెట్టాలన్నారు.    ప్రభుత్వం ఆదేశాల మేరకు హాస్టల్స్ లోను, అంగన్ వాడీ కేంద్రాల్లోను, పాఠశాలల్లోను పిల్లలకు అందిస్తున్న నిత్యావసర వస్తువులైన కోడిగ్రుడ్డు, పోర్ట్ ఫ్రైడ్  బియ్యాన్ని, తదితర వస్తువుల భధ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో  స్టోర్ రూమ్, వంటశాల, మధ్యాహ్నం భోజన పధకాన్ని, విద్యార్ధుల హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిష్టరును  పరిశీలించారు.  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అదే విధంగా స్ధానిక  ద్వారకానగర్, తంగెళ్లమూడి 196వ నెంబరు అంగన్ వాడీ కేంద్రం నిర్వహణ,  పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు , స్ధానిక అమీనాపేట నెం.1 గల ప్రభుత్వ సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో ఉన్న, బియ్యం నిల్వ ఉంచే  గదిని, వంటశాల పరిశీలించారు . అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ఆహారం, విద్య లోను ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, బిసి,  సోషల్ వెల్పేర్ జెడి నాగమణి, జయ ప్రకాష్, డిఎం సివిల్ సప్లైయిస్ మంజూ భార్గవి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, డివైఇఓ ఎ. రవిప్రకాష్, డిఇఓ ఆఫీసు ఎ. షరీఫ్, యంఇఓ ఆర్. రంగయ్య, ఫుడ్ సేప్టి ఆఫీసర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author