PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ప్రారంభమైన ఫుట్బాల్ టైక్వాండో పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఫుట్బాల్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రామాంజనేయులు ఫుట్బాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వై. శ్రీనివాసులు, క్రీడా సంఘ ప్రతినిధులు గంగాధర్, నారాయణ, బ్రహ్మ, తోపాటు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు  పాల్గొన్నారు.అనంతరం ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీలను వీఆర్. హాస్పిటల్ అధినేత వాసిరెడ్డి, బి .ఆర్. కే ఫౌండేషన్ అధినేత బుల్లెద్దుల రామకృష్ణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, క్రీడా సంఘ ప్రతినిధులు గంగాధర్ కేబుల్ టెన్నిస్ ప్రసాద్, టైక్వాండో ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ నాగన్న సుందర్ వెంకటేష్ అజయ్ తేజ అఖిల్  తదితరులు పాల్గొన్నారు.

About Author