రైతులు వరి నాట్లలో కాలి బాటలు వాటి ఉపయోగాలు
1 min read-జిల్లా వ్యవసాయ అధికారి ఐతే నాగేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు వరి నాట్లలో కాలిబాటలు వాటి యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐతే నాగేశ్వరరావు తెలిపారు, గురువారం ఆయన మండలంలో సాగుచేసిన వరి పంటలను ఆయన సందర్శించి అక్కడ వరి నాట్లు చూసి వరిలో కాలి బాటలు వాటి యొక్క ఉపయోగాలను గురించి రైతులకు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూవరిలో నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్లు వెడల్పు కాలిబాటలు తూర్పు పడమర దిశలో తీసుకోవడం వలన తక్కువ ఖర్చుతో 3 నుంచి 4 బస్తాలు దిగుబడి అదనంగా పెరుగుటకు అవకాశం ఉందని తెలిపారు,వానా కాలంలో గాలి తూర్పు, పడమర దిశలో వీస్తుందని వరి పంటకు ఈగాలి వెలుతురు బాగా సోకి వరి పంట బాగా దుబ్బుగా ఎదగడానికి దోహదపడుతుంద ఆయన రైతులకు తెలియజేసారు, ఇలా చేయడం ద్వారా సుడిదోమ సొకకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుందని రైతులు ఎరువులు వేయుటకు పురుగుమందులు పిచికారికి కూడా సులభతరంగా ఉంటుందని ఆయన రైతులకు వివరించారు, అంతేకాకుండా ఎలుకల బెడద నుండి కూడా తగ్గించుకోవచ్చునని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చరణ్ కుమార్ రెడ్డి , చెన్నూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.