బీసీ వర్గానికి.. సీఎస్ పదవి….
1 min readచంద్రబాబు నిర్ణయంతో బీసీ వర్గాల హర్షం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రెస్ నోట్ ను పంపిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహా అద్భుతం…… సత్రం రామకృష్ణుడు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అధికారికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పదవిలో నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీల పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు అని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు అన్నారు. నూతన సీఎస్ గా బీసీ బిడ్డ విజయానంద్ ను నియమించినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి సవితమ్మకు సత్రం రామకృష్ణుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీలకు అండగా నిలిచి, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మరియు ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. బీసీల పట్ల సంపూర్ణ విశ్వాసంతో 8 మందికి మంత్రి పదవులను కేటాయించడంతో పాటు, బీసీ బిడ్డకు కీలకమైన ముఖ్య కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించి, రాష్ట్రంలో బీసీ జాతులందరిలో ఒక నమ్మకాన్ని, నూతన ఉత్తేజాన్ని, ఆశలను చిగురింపజేసిన సీఎం చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తోందని, బీసీ సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడికి శాసన సభ స్పీకర్ గా, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రిగా అవకాశమిచ్చారన్నారు.ప్రస్తుత తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బీసీ నేత పల్లా శ్రీనివాస్, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, టీటీడీ చైర్మన్ శ్యామలరావు కూడా బీసీలు కావడం తమకెంతో గర్వకారణమన్నారు.అయిదేళ్ల జగన్ పాలనలో ఏనాడూ బీసీలను ఖాతరు చేయలేదని, బలహీన వర్గాల పట్ల నిర్దయగా వ్యవహరించారని విమర్శించారు.