PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్స్ కార్యవర్గం ఏర్పాటు  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్స్ సమావేశం ఈరోజు  కర్నూలు సి. క్యాంపు లో ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్స్ అందరు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ను సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఈ సమావేశంలో క్రింద కనబరచిన జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ధీర్ఘ కాల డిమాండ్లు గురించి చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానములు చేయడమైనది. సమస్యలు – డిమాండ్లు : 1.ధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హెల్త్ ఎడ్యుకేటర్స్ కు గజిటెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. 2. పాత జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాలలో రెండు డిప్యూటీ డెమో పోస్టులు మంజూరు చేయవలసినదిగా ప్రభుత్వాని కోరడమైనది. 3.  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ధీర్ఘ కాలంగా 26 జిల్లాలలో ఖాళీగా ఉన్న  డెమో పోస్టులు వెంటనే ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. 4. సమాన విద్యార్హతలు డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్, ప్రమోషన్ కలిగిన హెల్త్ ఎడ్యుకేటర్స్ ను ఎయిడ్స్ మరియు లెప్రసి విభాగం లో విలీనం చేసి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా మార్పు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. 5. రాష్ట్రము లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలలో ప్రమోషన్ ల ద్వారా భర్తీ చేసే సోసియల్ సైన్స్ లెక్చరర్ పోస్టులలో హెల్త్ ఎడ్యుకేటర్స్ కు ప్రాధాన్యత ఇవ్వవలసినదిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ సమావేశంలో నూతనంగా  ఎన్నికైన అయిన జిల్లా అధ్యక్షులు – W. వెంకటరమణ, జిల్లా కార్యదర్శి : P. సుభాషిణి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుచు, జిల్లా స్థాయిలో హెల్త్ ఎడ్యుకేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని సభ్యులకు హామీ ఇచ్చారు.

About Author