PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వైస్ ప్రసిడెంట్ గా మాజీ కలెక్టర్ ఏకగ్రీవ ఎన్నిక 

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ హార్ట్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో  కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .  ఈ మేరకు స్థానిక హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ సేవలు  నగర ప్రజలకు మరింత  విస్తృతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు . ఫౌండేషన్ తరఫున జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు గుండె జబ్బులపై అవగాహన కల్పించాలని కోరారు. 22 ఏళ్లుగా కర్నూలులో ఫౌండేషన్ కార్యదర్శి డా . చంద్రశేఖర్ అందిస్తున్న సేవలు అసాధారణమైన రీతిలో ఉన్నాయని, తనను ఫౌండేషన్ వైస్ ప్రసిడెంట్ గా ఎన్నుకోవడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *