PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కోఆర్డినేటర్ శ్రీమతి పలక్ వర్మ సమక్షంలో జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా నాయకులతో కలిసి హాజరైన మురళీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే షర్మిలమ్మ దేయమని షర్మిలమ్మ ఒక ప్రణాళిక ప్రకారం జిల్లాల వారీగా సమావేశాలు జరపడం పార్టీ బలోపేతానికి పునాది అని. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గ ఇన్చార్జిల సమన్వయంతో పనిచేస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు కర్నూలు పార్లమెంటులో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని త్వరగా నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమిస్తే వారి సమన్వయంతో ప్రతి జిల్లాలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మరియు గ్రామ, వార్డు, బూత్ కమిటీలు వేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మురళీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అంబటి రామకృష్ణ యాదవ్ మరియు కర్నూలు జిల్లా నందలి అసెంబ్లీ నియోజక వర్గాల కోఆర్డినేటర్లు షేక్ జిలాని భాష, ఎం ఖాసిం వలి, జీ రమేష్ యాదవ్, మురళీ కృష్ణంరాజు, బి క్రాంతి నాయుడు, యు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, డివి సాంబశివుడు ఎన్ సి బజారన్న, షేక్ ఖాజా హుస్సేన్, అనంతరత్నం, ఈ లాజరస్, వెంకట సుజాత, సాయి కృష్ణ తిప్పన్న నాయుడు, ఎన్ సుంకన్న ప్రతాపరెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.

About Author