కర్నూల్ రైల్వేస్టేషన్ ను పరిశీలించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు రైల్వే స్టేషన్ ను సందర్శించి రైల్వే స్టేషన్ నందు జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో స్టేషన్ ప్రధాన ద్వారం ఎదుట టీజీవి గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫౌంటెన్ ను అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించడం జరిగింది. నూతనంగా మరొక ఫౌంటెన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనువైన స్థలాన్ని టీజీ వెంకటేష్ పరిశీలించారు. అత్యాధునిక విదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫౌంటెన్ రైల్వే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు దోహదం చేస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ మున్నోజీ రావు, ఇంజనీర్ శివకుమార్, రైల్వే సీఐ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.