మాజీ సర్పంచ్ ముండ్ల సుధాకర్ రెడ్డి మృతి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం గుర్రంపాడు మాజీ సర్పంచ్. ముండ్ల సుధాకర్ రెడ్డి(76) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ,. కడప తన స్వగృహంలో మృతి చెందారు. చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామానికి చెందిన ముండ్ల సుధాకర్ రెడ్డి కడప మార్కెట్ కమిటీ చైర్మన్ గా అలాగే గుర్రంపాడు పంచ్ సర్పంచ్ గా 20 సంవత్సరాల పాటు అక్కడ ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఓబులంపల్లి. గుర్రంపాడు. నజీర్ బేగ్ పల్లి .గ్రామాల ప్రజలు ఆయనను మర్యాదపూర్వకంగా పెద్దాయనగా పిలిచేవారు. మండలంలో జడ్పిటిసి. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. ఏ వ్యక్తిని అయితే ఆయన ఎన్నుకుంటారో అదే వ్యక్తి ఆయా పదవులలో అది జెడ్పిటిసి కావచ్చు, మండల పరిషత్ అధ్యక్షులు గా కావచ్చు అక్కడి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. అక్కడి ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా. రాజకియనాయకులతో ఆయనకు మంచి సత్సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు పార్టీలకతీతంగా ఆయన తన నిర్ణయాన్ని తీసుకొని ఎవరైతే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారో వారికే తన మద్దతు తెలిపేవారు. సుధాకర్ రెడ్డి మృతితో ఓబులంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో ఏ సమస్య జరిగిన పెద్దాయన దగ్గరికి వెళితే ఆ సమస్య ఇట్టే పరిష్కరించడం జరుగుతుందని ఇప్పుడు పెద్దాయన లేడనే చేదు వార్త అక్కడ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. సుధాకర్ రెడ్డి భౌతిక గాయాన్ని ప్రజలు దర్శనార్థం కడపలోని స్వగృహంలో ఉంచారు. ముండ్ల సుధాకర్ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి పుత్త నరసింహారెడ్డి. మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి. కమలాపురం శాసనసభ్యుడు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. తిరుపతి తిరుమల దేవస్థానం కమిటీ మాజీ సభ్యులు మా సీమ బాబు. చెన్నూరు మాజీ జెడ్పిటిసి సభ్యులు. కాలువ సర్వేశ్వర రెడ్డి,తెలుగు యువత నాయకుడు ముండ్ల శ్రీనివాసులు రెడ్డి తో పాటు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు బంధువులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సుధాకర్ రెడ్డి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి భౌతికయాన్ని సోమవారం సాయంత్రం చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించినందుకు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.