PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొలిసారిగా అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసిన బి.వీరభద్ర గౌడ్

1 min read

ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌ.శ్రీ.బి.వీరభద్ర గౌడ్

పల్లెవెలుగు వెబ్ ఆలూరు  : హాలహర్వి మండలంలోని నిట్రవట్టి గ్రామంలో వారి చేతుల మీదుగా తెలుగుదేశం మరియు బిజేపి పార్టీల జెండాల ఆవిష్కరణచేసి అదే గ్రామంలో ఇంటర్నల్ సీపీ రోడ్లు కూడా వారిచేతుల మీదుగా ప్రారంభించి ఆలూరు తాలూకాలో తొలిసారికిగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.అనంతరం అదే గ్రామానికి చెందిన బిజేపి మండల కన్వీనర్ బసవరాజు  సోదరుని కూతురు వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో నిట్రవట్టి గ్రామ టిడిపి నాయకులతో పాటు,హాలహర్వి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ఆలూరు తాలూకా వివిద హోదాలలో ఉన్న టిడిపి +జనసేన+ బిజేపి నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగు యువత,  ఐటిడిపి ,టిఎన్​ఎస్​ఎఫ్​, టియన్​టియూపి మరియు నందమూరి, నారా,బివిజి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author