PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాలుగు లేబర్ కోడ్” లను  తక్షణమే రద్దు చేయాలి

1 min read

డాక్టర్ స్వామి నాథ్ కమిషన్” అమలు చేయాలి —కార్మిక సంఘం AITUC, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం AIKS

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక నాలుగు స్తంభాల దగ్గర ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం  కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తు ఏఐటియుసి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కార్మికులు ధర్నా చేశారు.ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు జి .నెట్టికంటయ్య అధ్యక్షత జరిగిన ఈ ధర్నా కార్యక్రమాలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్. క్రిష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి ఎం. రంగన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా గౌరవ అధ్యక్షులు ఎం కారన్న పాల్గొని  మాట్లాడుతూ,మనదేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలు కార్మిక రంగానికి పూర్తిగా నష్టం చేస్తున్నాయని అన్నారు. గతంలో ఉన్న కార్మిక చట్టాలను కొనసాగించాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత చేయాలని కోరారు. 2022 వ సంవత్సరం విద్యుత్ సవరణ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని మానుకోవాలని, రైతులకు బ్యాంకులోఉన్న అప్పులు అన్ని రద్దు చేసి, డాక్టర్ స్వామి నాథ్ కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 26000 కనీస వేతనం ఉండాలని డిమాండ్ చేశారు.  వ్యవసాయ పంపు సేట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలనే ఆలోచనను మానుకోవాలని, కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు.తదితర డిమాండ్లను  పరిష్కరించాలని దేశవ్యాప్తంగా కార్మికుల, రైతుల ఉద్యమం కొనసాగుతున్నప్పటికి, నరేంద్ర మోడీ రైతులు,కార్మికుల ఎడల రాక్షసుడు లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు.పేద వర్గాలను పిండి చేసి పెట్టుబడిదారులకు పంచభక్ష పరమాన్నలను వడ్డించి పేద వర్గాలకు ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నాడని తెలిపారు. అంబానీ లాంటి బడా పెట్టుబడుదారులకు యావత్ దేశ సంపదను కట్టబెడుతున్నాడు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతులు,కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొని సంఘిభవం తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్ష కార్యదర్శులు బి. మాదన్న, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి,హమాలీ సంఘం సభ్యులు రంగస్వామి, రామాంజనేయులు,ఉసెని,కొండయ్య, సుంకన్న, నాగన్న,రాజు,వ్యవసాయ కార్మిక సంఘం మండల  నాయకులు నరసింహుడు, దూదేకొండ ఆటోయూనియన్సభ్యులుకరెంట్,రాజశేఖర్,యల్లప్ప,పీరా, టౌన్ ఆటో యూనియన్ సభ్యులు హరి, పెద్దహుల్తి ఆటో యూనియన్ సభ్యులు రవి , చిన్న వ్యాపారస్తుల సంఘం సభ్యులు శ్రీను సి పి ఐ పార్వతి కొండ శాఖ కార్యదర్శి నాగేంద్ర, సభ్యులు ఉపేంద్ర , శంకర్, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.

About Author