నాలుగు ట్రాక్టర్లు జేసీబీ వాహనం సీజ్..
1 min readఅక్రమ మట్టి తరలింపుపై పోలీసుల ఉక్కు పాదం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలోని హంద్రీనీవా సృజల స్రవంతి కాల్వ సమీపంలో ఉన్న ఎర్ర మట్టిని పేదల కడుపు కొట్టి అక్రమార్కులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపారు.బుధవారం గ్రామ వీ ఆర్ఓ హనుమంతు ఫిర్యాదు మేరకు హెచ్ఎన్ ఎస్ఎస్ కాల్వ సమీపంలో సర్వే నెంబర్ 461 లో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్పందించిన బ్రాహ్మణకొట్కూరు ఏఎస్ఐ రఘురామయ్య గౌడ్ వెంటనే హుటా హుటిన కాల్వ దగ్గరకు చేరుకొని అక్రమంగా మట్టి తరలిస్తున్న 4 టాక్టర్లతో పాటు ఒక జేసీబీ ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.వీఆర్వో హనుమంతు,లస్కర్ల ఫిర్యాదు మేరకు గార్గేయపురం గ్రామానికి చెందిన వాహనాలను సీజ్ చేసినట్లు అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.