కృష్ణప్రదీప్’ నుంచి నలుగురికి యూపీఎస్సీ ర్యాంకులు
1 min readవిజేతలను అభినందించిన కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ పరీక్షలలో ప్రిలిమ్స్, మెయిన్స్ తో పాటు, ఇంటర్వ్యూలో కూడా నెగ్గి.. ర్యాంకులు సాధించినవారిలో నలుగురు కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందినవారు ఉన్నారని ఆ సంస్థ చీఫ్ మెంటార్ డాక్టర్ సీహెచ్ భవానీశంకర్ తెలిపారు. ‘‘షాహి దర్శిని (112), ధీరజ్ రెడ్డి (173), సమీక్ష ఝా (362), నాగ సంతోష్ అనూష (818) తదితరులు మెయిన్స్, ఇంటర్వ్యూలకు పర్సనల్ మెంటార్ షిప్ కూడా తీసుకుని విజయం సాధించారు. కేపీఐఏఎస్ గా ప్రసిద్ధి చెందిన ఈ అకాడమీ వారి ఢిల్లీ, హైదరాబాద్ బ్రాంచీలలో కొన్ని వందల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా శిక్షణ పొందారు. అనేకమందిని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసులకు పంపడంలో 20 సంవత్సరాల ప్రస్థానం గల కృష్ణ ప్రదీప్ కృతకృత్యులయ్యారు. 21వ శతాబ్దపు IAS అకాడమీ వ్యవస్థాపకుడు కృష్ణ ప్రదీప్‌తో సివిల్స్ ర్యాంకర్ శ్రీమతి సమీక్సా ఝా (362 ర్యాంక్).ఢిల్లీలోని కేపీఐఏఎస్ శిక్షణ కేంద్రంలో దాదాపు 500 మంది వరకు ఇంటర్వ్యూలకు శిక్షణ పొందారు. 275 మార్కులున్న ఈ ఇంటర్వ్యూకు కృష్ణ ప్రదీప్ తో పాటు చీఫ్ మెంటార్ డాక్టర్ భవానీశంకర్ వ్యక్తిగత పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చారు. తెలుగు సంస్థ అయిన కృష్ణప్రదీప్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం గర్వించదగ్గ విషయం. మొదటి ర్యాంకర్ అయిన ఆదిత్య శ్రీవాస్తవను కృష్ణ ప్రదీప్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు’’ అని ఆ ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ర్యాంకులు పొందినవారందరినీ అభినందిస్తున్నట్లు చెప్పారు.