తూకంలో మోసం.. రేషన్ దారులకు పంగనామాలు ..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: తూకంలో మోసం చేస్తూ.. రేషన్ దారులకు పంగనామాలు పెడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మండలంలోని మహానంది గ్రామపంచాయతీ లో రేషన్ పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. బుధవారం రేషన్ పంపిణీ విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వినియోగదారుల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తెలిసింది. ఇవి ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తూ 15 కేజీలు వేయాల్సిన కార్డుదారులకు పది నుంచి 12 కిలోల లోపలనే రేషన్ తూకం వేస్తూ వినియోగదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. రేషన్ తూకం వేసే ముందు 2 నుండి 3 కిలోలు ఉండే డబ్బాతో కలిపి తూకం వేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిలో కందిపప్పు కు ఐదు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. కందిపప్పు అదనంగా కావాలంటే మరో ప్యాకెట్ కు వంద రూపాయలు వసూల్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రశ్నించిన వారిని మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని బదులిస్తూ వినియోగదారులను బెదిరింపులకు గురి చేస్తు యధావిధిగా తనకు ఇష్టం వచ్చినట్లు తూకాల్లో మోసం చేస్తున్నట్లు తెలుస్తుంది. మహానందిలో అధిక భాగం గిరిజనులు మరియు నిరక్షరాస్యులు ఉండటం వారికి వరంగా మారినట్లు తెలుస్తుంది. కూత వేటు దూరంలో మండల రెవెన్యూ కార్యాలయం ఉన్న పర్యవేక్షణలోప కారణంగా ఆడింది ఆటగా పాడింది పాటగా లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తూ ఏదేచ్ఛగా ఇలాంటివి ఇక్కడ సర్వసాధారణం అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్డుదారుల నుంచి గుసగుసలు వినవస్తున్నాయి.