కుక్కలకు ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు
1 min readమండలంలో పలు ప్రాంతాల్లో కుక్కలకు టీకాలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: సాకుడుకుక్కలు, వీధి కుక్కలు( శునకాలు) వ్యాధి బారిన పడకుండా జిల్లా పశువైద్యాధికారులు ఆదేశాల ప్రకారం చెన్నూరు మండలంలో పలు గ్రామాల్లో టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు మండల పశు వైద్య అధికారులు ఆయా ప్రాంతాలోని రైతు సేవ కేంద్రాల్లో పనిచేసే పశు వైద్య సహాయకులు వారిచే కార్యక్రమాన్ని శనివారం నుంచి మొదలుపెట్టారు, ప్రపంచ జెనోసిస్ దినోత్సవం లో భాగంగా కుక్కలకు ఉచితంగా ఆంటీ రెబిస్ టీకాలు వేస్తున్నారు, చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కడప బళ్లారి రోడ్డులోని దుగ్గనపల్లి వ్యవసాయ పొలంలో“ హోమ్స్ ఫౌండేషన్ అనిమల్స్” మూగజీవాల సంరక్షణ కేంద్రం నిర్వాహకురాలు ఆలూరు రమణమ్మ నడుపుతున్న కేంద్రంలో శనివారం ఉదయం 30 కుక్కలకు ఉప్పరపల్లి రైతు సేవ కేంద్రం పశు వైద్య సహాయకుడు కళ్యాణ్ కుక్కలకు ఉచితంగా టీకాలు వేశారు, ఇక్కడ గత పది నెలలుగా ఆలూరు రమణమ్మ మూగజీవాల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన విషయం విధితమే కుక్కలు వ్యాధి బారిన పడకుండా టీకాలు వేస్తున్నట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ ఉపేంద్ర తెలిపారు, ఇండ్ల యందు పెంచుకుంటున్న కుక్కలకు వీధి కుక్కలకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు, ఈ టీకాలు ఉచితంగా వేయడం జరుగుతున్నదనిల్ ఆయనతెలియజేశారు.