వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదానం
1 min readపల్లెవెలుగు వెబ్ కడప : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప రిమ్స్ నందు ఐపి విభాగంలో బ్లడ్ బ్యాంక్ కు సంబంధించి ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వరల్డ్ మిషన్స్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో వరల్డ్ వైడ్ బ్లడ్ డొనేషన్ 1466వ, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, వరల్డ్ మిషన్స్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ కడప దేవుని సంఘ సభ్యలు దాదాపు 40 మంది యువతి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ జి.వి.రమాదేవి ఆర్ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులు, మాధురి లత గ్రెడ్ -I , శ్రీకాంత గ్రేడ్-II బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మెంబెర్స్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ స్వచ్ఛంద వరల్డ్ మిషన్ మిషన్ చర్చ్ ఆఫ్ గాడ్ సేవా సంస్థ వారు చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు, అన్ని దానాలలో కన్నా రక్త దానం చాలా గొప్ప కార్యమని చెప్తూ, ఒకేసారి 40 మంది సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొనడం అభినందనీయమని వారు తెలిపారు, ఈ సందర్భంగా వారు చర్చ్ ఆఫ్ గాడ్ వారిని అభినందించారు,వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ కడప సంఘ సభ్యల యొక్క ప్రేమను చూచి హాస్పిటల్ సిబ్బంది సభ్యులను అభినందించారు వరల్డ్ మిషన్స్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆర్గనైజర్ జి.ఎబినెజర్ మాట్లాడుతూ ఈ సంఘం పరలోకపు తల్లి యొక్క ప్రేమనుఈ లోకమునకు పంచుతూ, రక్తదానము శిబిరంలో పాల్గొన్న సంఘ సభ్యులు అందరికీ ఆయన అభినందించారు.