మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఉచిత హోమియో మెడికల్ క్యాంప్
1 min readఎమ్మెల్యే చేతులు మీదుగా మందులు పంపిణీ
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో వెల్నెస్ హోమియో క్లినిక్ విద్య సేవ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ అరుణ్ కందువరం, ఫౌండర్ &డైరెక్టర్ జి బి. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి చేతులు మీదుగా 180 మంది పారిశుధ్య కార్మికులకు ఉచిత హోమియో మందులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వారు ఆరోగ్యాంగా ఉంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, వారి సేవలను గుర్తించి, వారు ఆరోగ్యంగా ఉండేందుకు వెల్నెస్ హోమియో క్లినిక్స్ ఇంటర్నేషనల్, హార్వర్డ్ ఇంటర్నేషనల్ మేడ్వర్సిటీ సి ఈ ఓ డాక్టర్ కుందవరం ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. త్వరలోనే ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు కొరకు ఏర్పాటు చేసే కార్యక్రమం లో వెల్నెస్ హోమియో క్లినిక్స్ సి ఈ ఓ డాక్టర్ కుందవరం సేవలను ఉపయోగించు కుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, సామాజిక వేత్త, మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆలఫ్రెడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.