సెయింట్ జోసెఫ్స్ మహిళా కలాశాలలో ఫ్రెషర్స్ డే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక నందికోట్కూరు రోడ్ లోని సెయింట్ జోసెఫ్స్ మహిళా కలాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిధిగా రాయలసీమ వైస్ ఛాన్సెలర్ professor NTK Nayak హాజరయ్యారు.విద్యార్థినులు ఎంతో క్రమశిక్షణతో వున్నారని కళాశాల యాజమాన్యాన్ని మరియు కలాశాల నాయకురాళ్లుగా ఎన్నికైన విద్యార్థినులను అభినందిచారు. సమాజంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనదని, కళాశాలలో విద్యార్థినుల ఎదుగుదలకు నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని తమ ఎదుగుదలకు బంగారు బాటలు వేసుకోవాలని ప్రసంగిచారు. ఈ కార్య క్రమంలో కరెస్పాండంట్ సిస్టర్ రాజమ్మ , ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ విజయ , అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.