ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ హి సేవ పక్షోక్ష కార్యక్రమాలు
1 min readభక్తులు, ఆలయ సిబ్బంది రాజ గోపురం వరకు శుభ్రపరచుట
వివిధ సేవల రూపేణ రూ:1,18,100/-లు ఆదాయం
కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మంగళవారం సందర్భముగా ఏలూరుజిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం విచ్చేసిన సుమారు 1100 భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.1-00 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రిపేణా రూ.1,18,100/-లు ఆదాయము వచ్చినది. దేవదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాదికారులు జంగారెడ్డిగూడెం నగరపాలక సంస్థ కమీషనరు రాము సత్యనారాయణ ఆదేశాల మేరకు సెక్రటరీ ఆధ్వర్యంలో ది.17.09.2024 నుండి ది.02.10.2024 వరకు జరుగు స్వచ్చ తహి సేవ పక్షోత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ స్వామి వారి ఆలయ ఆర్చి వద్ద నుండి రాజ గోపురం వరకు రోడ్డుకు ఇరువైపుల శుభ్ర పరచుట జరిగినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.