PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపికి మొబైల్ షాప్ ఓనర్స్ మరియు టెక్నీషియన్ల పూర్తి మద్దతు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నియోజకవర్గం లోని పాత బస్టాండ్, గ్రాండ్ బావర్చి పైన ఉన్నటువంటి హాల్ నందు కర్నూలు నగర మొబైల్ ఓనర్స్ మరియు టెక్నీషియన్స్ అసోసియేషన్ వారు  అన్వర్ టైమ్స్ జావీద్ , సంగీత మొబైల్స్ ఓనర్  శ్రీకాంత్  ఏర్పాటు చేసిన సమావేశంలో కర్నూల్ లో నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి  A.Md. ఇంతియాజ్, IAS (Retd) , కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ SV మోహన్ రెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు శ్రీ అహ్మద్ అలీ ఖాన్  పాల్గొన్నారు. ఈ సమావేశం ముందు మొబైల్ షాప్ ఓనర్స్ మరియు అసోసియేషన్ వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ద్వారా మేము ఎంతో లబ్ది పొందామని మరలా జగన్మోహన్ రెడ్డి కే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో స్టి A.Md. ఇంతియాజ్  మాట్లాడుతూ తాను ఒక సాధారణ కుటుంబంలో జన్మించానని తనకు సాధన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు తెలుసునని కచ్చితంగా మొబైల్స్ షాప్ ఓనర్స్ మరియు టెక్నీషియన్స్ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.

About Author