PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి కే తమ పూర్తి మద్దతు..

1 min read

వైసిపి కి కర్నూలు సిటీ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి పూర్తి మద్దతు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్  అసోసియేషన్ వారు ఎస్వీ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి  ఏ ఎం డి ఇంతియాజ్, IAS (Retd) , కర్నూలు మాజీ ఎమ్మెల్యే  ఎస్వీ మోహన్ రెడ్డి  పాల్గొన్నారు. అసోసియేషన్ వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం వారందరికీ అండగా ఉందని కావున కచ్చితంగా వైసిపి కే తమ మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది.  ఇంతియాజ్  మాట్లాడుతూ తాను ఒక IAS గా స్వచ్ఛంద పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి సేవ దృక్పథంతో వచ్చానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యం అని చెప్పడం జరిగింది.

About Author