రజక కార్పొరేషన్ కు నిధులు కేటాయించి యువతను ఆదుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రజక కార్పొరేషన్లకు నిధులు కేటాయించి యువతను ఆదుకోవాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఐలమ్మ జిల్లా కార్యాలయంలో రజక యువత సమావేశం రేమట అంజి అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ధోబి పోస్టులను రజక యువకులచే భర్తీ చేయాలని కార్పొరేషన్లకు నిదులు కేటాయించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, స్వతంత్రంగా చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం సహకరించాలని డిమాండ్ చేశారు. గతంలో కార్పొరేషన్ల ద్వారా మంచి నిధులు వచ్చేవని ఇప్పుడు ఆ నిధులు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతూ ఉందని వివక్ష నిర్మూలన కోసం యువత నడుం బిగించాలని తెలియజేశారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర మాట్లాడుతూ యువత ఐక్యతతో పనిచేయాలని స్వాతంత్ర సమరయోధుల స్పూర్తితో విద్యా ఉపాధి కోసం,సమాజ మార్పు కోసం కృషి చేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని యువశక్తి భారతదేశంలో ఉందని ఆ యువశక్తి ని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యతతో పనిచేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, లోకేష్, రామకృష్ణ, సురేష్, శ్రీనివాసులు, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.