భావి వైద్యులుగా రాణించండి..
1 min readప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి..
- మెడికల్ విద్యార్థులకు సూచించిన జీజీహెచ్ కార్డియాలజి ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్
- కర్నూలు హెల్త్ క్లబ్లో.. కార్డియాలజి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలు, పల్లెవెలుగు:ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని… పక్కా ప్రణాళికతో భావి వైద్యులుగా రాణించాలని సూచించారు కర్నూలు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్. స్థానిక ఏ క్యాంపులోని హెల్త్ క్లబ్లో శుక్రవారం డిప్లొమా కార్డియాలజి ఫైనల్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గెట్ టు గేదర్ నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ మెడికల్ విద్యార్థులకు పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. లక్ష్యం దిశగా అడుగులు వేసే ప్రతి విద్యార్థి జీవితంలో సక్సెస్ సాధిస్తారని, వైద్య వృత్తిలో రాణించాలంటే చదువుతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రత అవసరమన్నారు. గుండెకు సంబంధించిన వ్యాధులు, వైద్యచికిత్స పై అవగాహన పెంచుకోవాలన్నారు. వైద్య వృత్తిలో రాణించి సక్సెస్ అయిన మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించిన ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ …. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడించిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, మెడికల్ కళాశాలకు మరింత మంచి పేరు తీసుకురావాలని మెడికల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. ఆ తరువాత కార్డియాలజి విద్యార్థులు డ్యాన్స్ చేస్తూ… ఆనందం పంచుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. కిరణ్, డా. ప్రశాంత్, డా. బిందు, కార్డియాలజి పీజీ విద్యార్థులు, క్యాథలాబ్ మరియు ఈసీజీ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.