విద్యార్థులలోని వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఫ్యూచర్ ఆన్ కార్యక్రమం
1 min readజిల్లాలో 11గురుకుల విద్యాలయాలనుండి విద్యార్థులు పాల్గొన్నారు
వట్లూరు గురుకుల విద్యార్థులు ఏడు బహుమతులు గెలుపొందారు
ప్రశంసించిన ప్రిన్సిపాల్ మేరీ ఝాన్సీ రాణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విద్యార్థులలోని వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించిన ఫ్యూచర్ ఆన్ -2024 ఏలూరు జిల్లా వట్లూరు లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఏలూరు జిల్లాలో గల 11 గురుకుల విద్యాలయాల నుండి విద్యార్థులు తమ ప్రాజెక్టులతో పాల్గొనడం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం కాగా బహుమతుల ప్రధానోత్సవంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదపాడు మండలం ఎంఈఓ-2 డి.వి రమణ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వట్లూరు గురుకుల పాఠశాల ఏడు బహుమతులు గెలుపొందటం తో పాటుగా ఈనెల 28, 29 తారీకులలో ద్వారకాతిరుమలలో జరగబోయే జోనల్ లెవెల్ కు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.