జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ట్రాఫిక్ రూల్స్ అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక వెంకాయపల్లె లోని జీ.పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ రూల్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్టీవో భరత్ చావన్మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కర్నూలు తాలూకా ఎస్ఐ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ యొక్క అవగాహన కల్పించారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులను త్రిబుల్ రైడింగ్ వెళ్లొద్దని హెల్మెట్ ధరించాలని మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ తూచా తప్పకుండా పాటించాలని తద్వారా యాక్సిడెంట్ ని నియమించగలరని వివరించారు. అలాగే విద్యార్థులు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని తద్వారా రోడ్డు ప్రయాణం సజావుగా సాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమం జిపి సెట్ పుల్లయ్య కాలేజీ ఎం ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మరియు ఆర్టీవో గారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమం స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ జి.శశి కుమార్ అధ్యక్షతన జరిగినది.