ఘనంగ జరిగిన గజ్జహల్లి ఆంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండలంలోని గజ్జహల్లి లో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి జీర్ణోదారణ మరియు కొత్తగా నిర్మించే శిల దేవాలయ నిర్మాణం పనులు భూమి పూజ కార్యక్రమం గజ్జెహళ్లి తి మ్మరెడ్డి, గజ్జహళ్లి హనుమంత రెడ్డి, గజ్జహళ్లి విరుపాక్షి రెడ్డి వంశికులు గజ్జహల్లితిమ్మారెడ్డి ,సతీమణి గజ్జహల్లి సావిత్రమ్మ,, గజ్జెహళ్లి హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు, గజ్జెహళ్లి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులఆధ్వర్యంలో పురోహితులు జే కే నర్సింగాచార్, జెకె రాజీవ్ ఆచార్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసివేద మంత్రోచ్ఛారణ లు పటిస్తూ గణపతి పూజ, గోపూజ గో ప్రదక్షణ ,హోమం, జైశ్రీరామ్, జై ఆంజనేయ, జై రామలక్ష్మణ జయ జయ ధ్వనుల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా పూజలు నిర్వహించి ఆంజనేయ ఆలయం పై కప్పు గోడను గడ్డపారతో తిమ్మారెడ్డి, సావిత్రమ్మలు గోడలను కూలగొట్టి మట్టిని ఎత్తివేశారు. భక్తులకు ఆలయ ధర్మకర్త హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ గజ్జహల్లి సాగునీటి సంఘం అధ్యక్షుడు మరియు వంశపారంపర్య ధర్మకర్త గజ్జిహళ్లి హనుమంత రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయం నిర్మించి వందేళ్లు అయిందని దాని ఆలన పాలన తామే చూస్తున్నానని అన్నారు 1959లో తమ తాతగారైన గజ్జిహళ్లి తిమ్మారెడ్డిగారి కుమార్తె శంకరమ్మ లు మొదటిసారిగాఆంజనేయస్వామి ఆలయ జీర్ణోదారణ పనులు చేశారని అన్నారు. స్వామివారికి ప్రతినెల నూనె డబ్బా సరఫరా చేస్తున్నామని అలాగే 2015లో చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మించామని మరియు కెరే హనుమప్ప ఆలయాన్ని మూడు లక్షల రూపాయలతో ఆలయంలో సిసి వేశామని, కొత్త గేటు నిర్మించామని ఆలయం చుట్టూ ప్రహరీ గోడ కట్టించామని అన్నారు. శ్రీ పోతులింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేశామని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన శిలా కట్టడాన్ని తాము సొంత ఖర్చులతో , అందరి మద్దతుతో రెండవసారి ఆలయాన్నికట్టిస్తున్నామని ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని తమ కుటుంబం ధార్మిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటు సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. భూమి పూజా కార్యక్రమంలో వంశ పారంపర్య ధర్మకర్తలు గజ్జహళ్లి తిమ్మారెడ్డి, గజ్జెహళ్లి సావిత్రమ్మ, గజ్జహళ్లి హనుమంత రెడ్డి, గజ్జెహళ్లి శ్రీనివాసరెడ్డి, భక్తులుశివరామరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కృష్ణ సాగర్ రెడ్డి, రామ్ సాగర్ రెడ్డి, వరలక్ష్మి రెడ్డి, ఎం హనుమంత్ రెడ్డి, వెంకన్న గౌడ, పూజారి రామ, సోమి, కాళ్లప్పాచారి, రామలింగ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.