గణేష్ ఉత్సవాలు ప్రారంభించింది “హిందూ సంఘటన ” కోసమే…
1 min readగూడా సుబ్రహ్మణ్యం దక్షిణాంధ్ర రాష్ట్ర సహకోషాధికారి….
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా సమావేశం ఈ రోజు ఉదయం 11:00 గం.లకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం, జి పుల్లారెడ్డి భవన్ రెవెన్యూ కాలనీ నందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర సహకోశాధికారి కూడా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1893 సం. లో పూనే లో బాలగంగాధర్ తిలక్ మహాశయుడు ప్రారంభించాడనీ అప్పటి నుండి దిన దిన ప్రవర్ధమానమై ఈరోజు దేశవ్యాప్తంగా అత్యద్భుతమైన సామాజిక ఉత్సవంగా వెలుగొందుతున్నది. కర్నూలు నగరంలోనే కాక జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల గణేష్ మంట పాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీ గణేశ మహోత్సవాలను నిర్వహిస్తున్నారనీ ఇందులో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలందరూ భాగం వహించాలని ఆయా ప్రఖండల వారీగా ప్రతి గణేష మంటపాన్ని దర్శించి అక్కడున్న కార్యకర్తల వివరాలను సేకరించి ఉత్సవాల తర్వాత వారందరినీ ప్రఖండల వారీగా కలిపి వారందరికీ ఒక “చిరు” సన్మానాన్ని చేస్తూ మన సంస్థలో భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు తెలుగు చిన్న మద్దిలేటి మాట్లాడుతూ కార్యకర్తలందరూ ఎంతో మీ మీ ప్రఖంఢలలో శ్రమకోర్చి ప్రతి గణేశ మంటపాన్ని సందర్శించి కనీసం 100 మంటపాల వివరాలు సేకరించాలనీ తద్వారా ప్రఖంఢలలోని సమితులను పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నగర ఉపాధ్యక్షులుగా ఉన్న శివపురం నాగరాజును జిల్లా విశేష సంపర్క కన్వీనర్ గా నూతనంగా నియమించడం జరిగింది.అలాగే మరికొంత మంది కార్యకర్తలకు కూడా నూతన బాధ్యతలను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, ధర్మప్రసార్ రాష్ట్ర కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్, సామాజిక సమర్సత ప్రాంత హోలీ సభ్యులు నీలి నరసింహ, విభాగ ధర్మ ప్రసాద్ కన్వీనర్ విజయుడు, సత్సంగ కన్వీనర్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్, జిల్లా సహకార్య దర్శులు గూడూరు గిరిబాబు ఈ పూరి నాగరాజు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, మాతృ శక్తి కన్వీనర్, జంపాల రాధిక, జిల్లా దుర్గా వాహిని కో కన్వీనర్ సింధూర శ్రీవాణి, ప్రఖండ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్,కరణం సుధాకర్, జంపాల నవీన్, సంజీవయ్య, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.