పల్లెల్లో కొలువుదీరిన వినాయకుడు..
1 min readపీరుసాహెబ్ పేటలో పూజల్లో పాల్గొన్న నేతలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని 24 గ్రామాల్లో శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా అన్ని గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.మండపాల్లో గణనాథుని ఆశీనులు అయిన తర్వాత గణనాధునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు.అందులో భాగంగాలో మండలంలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో నేతలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు.ప్రకృతికి హాని కలిగించకుండా మట్టి వినాయకుని తెచ్చుకొని పూజించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి గ్రామ ప్రజలు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుని పూజించారు.తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ మెంబర్ రామ్ మోహన్ రావు మరియు గ్రామ నాయకులు ఈ.రామేశ్వర్ రెడ్డి,దేవమాడ జయరాముడు,దేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,ఎర్రమల పుల్లారెడ్డి,జి నాగేశ్వర్ రెడ్డి, ఆర్ భద్రారెడ్డి,సి కృష్ణ వినాయక కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.