ఇరిగేషన్ గట్లపై కాలువలలో చెత్తాచెదారాలను, వ్యర్ధాలను వేయరాదు
1 min readఅతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశంలో రాష్ట్రంలో ప్రధాన సమస్య ఆక్రమణ ప్రతి మనిషి తనకున్న దాని కన్నా అదనంగా ఇంకాస్త సర్దుబాటు చేసుకోవాలని (ఆక్రమణ చేసుకోవాలని) తాపత్రయ పడుతుంటారు. ఇళ్లలో వాడి పడేసిన చెత్తాచెదారం వ్యర్ధాలను, చెరువుగట్లపై కాలువగట్లపై, కాలువలలో చెరువులలో సక్రమమైన పద్ధతిలో కాకుండా పడేస్తుంటాము అవి తర్వాత మనకు ఎంత అనర్ధాన్ని తెస్తాయో ఊహించలేము. ఆ అనాలోచిత ఆలోచనలే నేటి విపత్తులకు కారణమవుతున్నాయని మేధావులు, నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇరిగేషన్ ఏలూరు డివిజన్ వారు వినత్నంగా తమ పరిధిలో హెచ్చరిక బోర్డులను ప్రదర్శించారు. తమ్మిలేరు గట్టుపై కానీ, నదిలో కానీ, కాలువ గట్లపై గానీ చెత్తాచెదారము. వ్యర్ధాలను వేయరాదని సంబంధిత ప్రజల ఇరిగేషన్ ప్రదేశాలలో అక్రమంగా నిర్మాణాల కానీ, కట్టడాలుగాని చేయరాదని అతిక్రమించితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇoడ్లలో వాడి వేసిన వ్యర్ధాలను కాలువ గట్లపై వేయకుండా ప్రతి కుటుంబం సమాజ శ్రేయస్సును కోరుకుంటూ ఈ దిశగా ప్రయత్నం చేస్తే భావితరాల భవిష్యత్తు కు పెనుముప్పుకు, విపత్తులకు గురికాకుండా ఆరోగ్యకరమైన మంచి మనుగడను సాగిద్దామని ఆశిద్దాం.