PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గ్యాస్టిక్ ’ పై .. అవగాహన పెంచండి..

1 min read

 సర్జికల్​ గ్యాస్ర్టో ఎంటరాలజి డా. సురేష్​ కుమార్​ రెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం పై అవగాహన లేక ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు శ్రీ అశ్విని సూపర్​ స్పెషాలిటీ సర్జికల్​ గ్యాస్ర్టో ఎంటరాలజి డా. సురేష్​ కుమార్​ రెడ్డి. గురువారం పల్లెవెలుగు నూతన క్యాలెండర్​ ను ఆయన ఛాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా. సురేష్​ కుమార్​ రెడ్డి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయకపోవడం.. సమయానికి భోజనం చేయకపోవడం..  ఇష్టానుసారంగా మందు, ధూమపానం చేయడం తదితర దుర్వ్యసనాల కారణంగా గ్యాస్ట్రిక్​ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కథనాలు రాయాలని ఈ సందర్భంగా డా. సురేష్​ కుమార్​ రెడ్డి సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *