మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం
1 min readనూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు రావలసిన బకాయలు వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంత్ రాజు
నూతన కమిటీలో అధ్యక్ష, కార్యదర్శులుగా జె సత్యనారాయణ,ఝాన్సీ రాణి
జిల్లాల సమావేశాలు పై పలువురు హర్షం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా ప్రజా పరిషత్ కాంపౌండ్ లోని పంచాయతీ రాజ్ ఇద్యోగుల సంఘం భవనము నందు ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అసోసియేటెడ్ అధ్యకురాలి గా పి.పద్మావతి జిల్లా అధ్యక్షులుగా జె. సత్యనారాయణ సెక్రెటరీ గా ఝాన్సి రాణి, ట్రెజరర్ గా ఎన్.ఎన్.వి సతీష్ లు ఎన్నుకో పడ్డారు . ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం లో ఉద్యోగులకు, రావలసిన బకాయిలు పి.ఆర్.సి. కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయం పట్ల ప్రభుత్వం సానుకూలత చూపించి విడుదల చేయాలని కోరినారు. అలాగే సంక్రాంతి సందర్భంగా బకాయి ఉన్న డి.ఏ ల లో కనీసం రెండు డి.ఏ ఆను విడుదల చేయాలని ఆకాంక్షించుతూ ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో అనేక సమస్యలు సంవత్సరాల తరబడి పెరిగిపోయాయని, సమస్యల అన్నీంటి పై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. త్వరలోనే శాఖమాత్యులను, రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి సమస్యల పై సానుకూల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ వారు జిల్లాల సమావేశం ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రమోషన్ లు జి.పి.ఎఫ్ బకాయిలు విడుదల చేయాలని తెలియచేసారు. ఏం.నాగమణి మాట్లాడుతూ ప్రతి జిల్లా కార్యాలయములలోనూ మరియు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు లలో సూపరింటెండెంట్ పదవులు మంజూరు చేయాలని కోరారు. టి.వి.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ అన్నీ ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు లలో సరిపడు సిబ్బంది లేరని, అందుకు సంఘ నాయకులు కృషి అవసరమని తెలిపారు. ఏ. శేషాచార్యులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న అన్నీ కాడర్ లలో పదోన్నతుల ద్వారా బర్తి చేయాలని తెలియచేసారు.నూతనంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సూపర్వైసర్ లు అసోసియేషన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర కమిటీ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర సంఘం బలోపేతానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజాప్ కుమార్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పద్మ మాట్లాడుతూ త్వరలోనే అన్నీ కమిటీ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగులు పి.రేవతి, సీనియర్ అసిస్టెంట్, కృష్ణ కుమారి, సూపర్వైసర్, పి.బ్యూల, సి.డి.పి.ఓ స్వప్న, సూపరింటెండెంట్, ఏ. విమల కుమార్, సూపరింటెండెంట్ మరియు తూర్పు గోదావరి ఏం. నాగమణి, సూపరింటెండెంట్, రోజారాణి, సూపరింటెండెంట్ మరియు ఉమ్మడి కృష్ణ జిల్లాల ఉద్యోగులు రామకోటయ్య, సీనియర్ అసిస్టెంట్ కళ్యాణ్. ఏలూరు బ్లాక్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ ఎం భీమారాణి తదితరులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.