మాట తప్పిన మోడీ ప్రభుత్వం పై మరో పోరాటానికి సిద్ధం కండి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 26వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి CITU-రైతు సంఘాలుకేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,రైతు సంఘం మండల అధ్యక్షులు బి.నాగమద్దయ్య,సీనియర్ నాయకులు జి.కొండయ్య,సిఐటియు మండల,పట్టణ అధ్యక్షులు పి.రామాంజనేయులు,నక్కీశ్రీకాంత్ పిలుపునిచ్చారు.స్థానిక కొండపేటలోని మోటార్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం నందు ఆదివారం సిఐటియు మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కేవలం యాజమాన్యాలకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని,అదేవిధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిందని వీటికి వ్యతిరేకంగా కార్మికులు,రైతులు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారని అందులో భాగంగా ఢిల్లీ లో దాదాపు సంవత్సర కాలం పాటు రైతులు చేసిన పోరాటం సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటగాని,కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ముఖ్యంగా డ్రైవర్ల మెడకు ఉరితాడు లాంటి న్యాయ సంహిత చట్టం 106 (1) (2) లపై కార్మికులకు ఇచ్చిన మాటగానీ నిలబెట్టుకోలేదని ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోడీ మాట తప్పారని మోడీ గారు ఇచ్చిన మాటను ఎలా అమలు చేయించుకోవాలో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం నేర్పిందని ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర రైతు సంఘాలు,ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు అన్నారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని,అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలకై పార్లమెంట్లో చట్టం చేయాలని,రైతుల పైన ఉన్న అప్పులను రద్దు చేయాలని,విద్యుత్ సంస్కరణల నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయించాలని,పంటల నష్టపరిహారాలు,పంటల బీమా పథకం కౌలు రైతులందరికీ వర్తింపజేసి అమలు చేయాలని, ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలు అమలు చేయాలని,లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,ప్రభుత్వ సంస్థల అమ్మకాలను ఆపాలని,కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలను విడనాడాలని,కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని,రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు,తిమ్మయ్య,మురళి,ప్రసాద్,రంగడు, వలి,సుబ్బయ్య,రామాంజనేయులు,రామకృష్ణ,శేఖర్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.