సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై నివేదిక ఇవ్వండి
1 min readహాస్టళ్లలో ఖాళీలు లేకుండా హేతుబద్ధతతో అడ్మిషన్స్ చేయాలి
హాస్టళ్లలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తరగతుల నిర్వహణ
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు, అదనపు గదులు, టాయ్లెట్స్ పై అంచనాలను రూపొందించి వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమం, బిసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, ఐసీడీఎస్ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రధానంగా కలెక్టర్ వసతిగృహాల నిర్వహణపై కలెక్టర్ లోతుగా సమీక్షించారు.సమీక్షలో భాగంగా అధికారులు హాస్టళ్లలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ శాఖల హాస్టళ్లలో చేయాల్సిన తక్షణ మరమ్మతులు, అదనపు గదుల, టాయ్లెట్స్ లకు సంబంధించిన సమగ్ర నివేదికను మండల, డివిజన్ వారీగా వారంలోపు తనకు అందచేయాలని అధికారులను ఆదేశించారు.. హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్య, అడ్మిషన్ లపై సమీక్షిస్తూ, వలసలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో ఖాళీలు ఉన్నాయని, ఆలూరు హాస్టల్ లో 131 సీట్లు, నందవరం హాస్టల్ లో 223 ఖాళీలు ఉన్నాయని, అలా కాకుండా అన్ని హాస్టళ్లలో విద్యార్థులు పూర్తిస్థాయిలో చేరే విధంగా అడ్మిషన్లను రేషనలైజ్ చేయాలని కలెక్టర్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.జిల్లాలో సరైన భవన సదుపాయం లేకపోవడంతో నాలుగు బీసీ సంక్షేమ వసతిగృహాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందిస్తూ, వసతిగృహాలను మూసి వేయకూడదని, వాటిని ఎక్కడికైనా తరలించడమో లేక అద్దె భవనాల్లో నిర్వహించడమో చేయాలని కలెక్టర్ ఆదేశించారు..భవనాలకు అద్దె ఎక్కువ అడుగుతున్న దృష్ట్యా ఈ అంశంపై ఉన్నతాధికారులకు డిఓ లెటర్ ను తయారు చేయాలని కలెక్టర్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.బి. తాండ్రపాడు లో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహానికి అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు..ట్రైబల్ వెల్ఫేర్ లో పని చేస్తున్న 44 మంది డైలీ వేజ్ వర్కర్ల కు వేతనాల మంజూరు, ఆప్కాస్ లో చేర్చే అంశాలపై లేఖను సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు.హాస్టళ్లలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తరగతుల నిర్వహణహాస్టళ్లలో ఉన్న హాస్టళ్లలో ఉన్న పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత చెందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు..వచ్చే నెల నుండి ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామని కలెక్టర్ తెలిపారు.. ప్రతి సబ్జెక్టులో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, వారి ద్వారా పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రత్యేక బోధన అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.. ఈ మేరకు హాస్టల్లో వర్చువల్ క్లాస్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మైనారిటీ సంక్షేమంలో భాగంగా ప్రధానమంత్రి 15 పాయింట్స్ ప్రోగ్రామ్ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖ అధికారిని ఆదేశించారు. ఆదోని ప్రాంతంలో ఐటిఐ కళాశాల భవనం పూర్తి అయినా కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ టేక్ఓవర్ చేసుకోలేదని, స్టాఫ్, విద్యార్థులు లేరని నిర్లక్ష్యంగా ఉన్నారేంటి అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు..వెంటనే ఈ అంశంపై డిఓ లెటర్ సిద్ధం చేయాలని మైనారిటీ శాఖ అధికారిని ఆదేశించారు. ఆదోని ఐటిఐ కళాశాల, రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభానికి మంత్రి, ఆదోని శాసనసభ్యులతో సంప్రదించి తేదీ నిర్ణయించి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్,ఉర్దూ డిగ్రీ కాలేజ్, హండ్రెడ్ బాయ్స్ హాస్టల్ లకు భూమి ని కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జెడి రంగలక్ష్మి దేవి, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, మైనారిటీ సంక్షేమ అధికారి సునీల్ ఖన్నా, ఈడి బిసీ కార్పొరేషన్ జాకీర్, ఈడి మైనారిటీ కార్పొరేషన్ సబిహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.