ఎన్నికల్లో స్థానిక వ్యక్తికే పట్టం కట్టండి..
1 min readకేసీ కెనాల్ రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు -అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ -ముచ్చుమర్రిలో మాండ్ర,జయసూర్య రోడ్ షో
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు (మిడుతూరు): రేపు 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోకల్ వ్యక్తులు ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులకే పట్టం కట్టడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో మండల టిడిపి కన్వీనర్ పలుచాని మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 80 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని రైతులకు సాగునీరు ముఖ్యమని 2014 నుంచి 2019 వరకు పోలవరం ప్రాజెక్టు 75% చంద్రబాబు పూర్తి చేశారు.శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఘనత అదే విధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ మొదటి సంతకం పైనే ఉంటుందని స్థానిక వ్యక్తికి ఓటు వేస్తే మీ సమస్యల గురించి ఆయనకు తెలుసని వేరే వాళ్లకు ఓట్లు వేస్తే ఇక్కడి సమస్యల గురించి వారికి తెలియదని టిడిపి అధికారంలోకి వస్తే రౌడీ షీటర్లను కడప సెంట్రల్ జైలుకు పంపడం ఖాయమని శివానందరెడ్డి అన్నారు.టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య మాట్లాడుతూ కేసీ కెనాల్ రైతులను ఆదుకున్న ఘనత చంద్రబాబు.టిడిపి అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలం మూడు లక్షల పైగా ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని పరిశ్రమలు రావాలంటే విజనరీ ఉన్న నేత చంద్రబాబు మాత్రమేనని పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రజలు ఏ విధంగా బ్రతకాలని గిత్త జయ సూర్య అన్నారు.రేపు జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మాండ్ర లింగారెడ్డి,బండి జయరాజు, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,గిరీశ్వర్ రెడ్డి,మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ కాత రమేష్ రెడ్డి, రామయ్య,బ్రహ్మారెడ్డి, నరసింహారెడ్డి,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.