ఎస్సీ వర్గీకరణలో అల్పసంఖ్యాక కులాలకు కూడా న్యాయం చేయండి…
1 min readతూర్పాటి మనోహర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ లోని అన్ని కులాలు సమానంగా హక్కుల అందాలనే తీర్పు సంతోషమైన విషయం.SC లోనే సంచార, అల్పసంఖ్యాక, కులాల కూడా రిజర్వేషన్లు లో న్యాయం చెయ్యండి.బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రిజిస్టర్ 1987 నుంచి 2025 వరకు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినది రాష్ట్ర జనాభా 80 వేలు కలిగి ఉన్నాం. ఉషా మొహ్రా, లోకూర్, శ్రీరామచంద్ర రాజు, జేసీ శర్మ వంటి కమిషన్ లో బేడ బుడగజం కులమును ఎస్సీ గానే ప్రకటించబడినది కాబట్టి మా కులమును కూడా వర్గీకరణలో న్యాయం చేయాలని కోరడం జరిగినది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ జాతీయ అధ్యక్షులు తాటికొండ నారాయణ మహిళా నాయకులు ఎడవల్లి సాయి కృష్ణమ్మ, ఆలేటి సుంకమ్మ, పెళ్లూరి లక్ష్మి, రుద్రాక్ష దస్తగిరి సంకుల మాలింగప్ప ధూపం రంగస్వామి సిరివాటి సవారి రంగస్వామి జమ్మన్న మొదలగు వారు పాల్గొన్నారు.