PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి: టీజీ భరత్

1 min read

లక్ష్మీ నగర్‌లో టీజీ భరత్ భరోసా యాత్ర

కర్నూలు, పల్లెవెలుగు:ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రజలను కోరారు. నగరంలోని 24వ వార్డు లక్ష్మీ నగర్, మద్దూర్ నగర్‌లో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని.. తనను గెలిపిస్తే ప్రజలందరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లపాటు పాలించిన వైసీపీ కర్నూల్‌లో ఎక్కడ చూసినా సమస్యలనే మిగిల్చిందని మండిపడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని.. తాగునీరు సమయానికి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగరవాసులకు సరిపడా నీటిని నిలువ చేసుకునేందుకు ఎస్ఎస్ ట్యాంక్ తప్పా.. మరొక ప్రత్యాయం లేదన్నారు. తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు చెక్ డ్యామ్ కట్టాలని జీవో తీసుకువచ్చారని.. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఆ జీవో గురించి పట్టించుకోలేదన్నారు. తాను గెలిచిన తర్వాత ఐదేళ్లలో కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. పేద ప్రజలు ఇబ్బందులు లేకుండా జీవనం సాగించేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందన్నారు. ఇక కర్నూలు ప్రజల అవసరాలు, ఆలోచనలను బట్టి తాను ఆరు గ్యారెంటీలు తీసుకువచ్చానని చెప్పారు. ఐదేళ్లలో వీటిని తప్పకుండా అమలు చేస్తానన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా కర్నూల్ ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పారు. అయితే పవర్ ఉంటే మరింత ఎక్కువ అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ తెలిపారు. స్థానికంగా ఉండి కర్నూలు ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి అయిన తనకు తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు.

లక్ష్మీనగర్​లో… టీజీ భరత్ కు ఘనస్వాగతం..

 టీజీ భరత్ భరోసా యాత్ర పేరుతో లక్ష్మీ నగర్‌లో పర్యటించిన టీజీ భరత్‌కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. యాత్ర ప్రారంభం నుంచి మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆయనను వీధి వీధి వద్ద ఆయనకు స్వాగతం పలికారు.  ఏ వీధికి వెళ్లినా పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం తమ ఇంటి పేరు లాంటిదని తాము ఉన్నంతవరకు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని మహిళలు ఆయనతో చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రవణమ్మ, సీనియర్ నాయకులు స్వామి రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బషీర్, జనసేన ఇంఛార్జి అర్షద్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ, టీడీపీ నాయకులు లక్ష్మణరావు, పర్వినీసా, ఉపేంద్ర, విశ్వనాథ్, సునీల్, ఎల్లప్ప, గుణ, షేక్షా, భాను, జ్యోతి, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, టీడీపీ సీనియర్ నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

About Author