PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై కేంద్రాన్ని నిలదీయండి

1 min read

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మునిగిపోయే నావ

రాష్ట్ర మాజీ మంత్రి  సాకే శైలజానాథ్     

పల్లెవెలుగ వెబ్ కర్నూలు:           రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలని రాష్ట్ర మాజీ మంత్రి సాకే శైలజానాథ్  డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కే బాబురావు తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్ గారు మాట్లాడుతూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి పది సంవత్సరాలు అయిందనీ పది సంవత్సరాలలో చంద్రబాబు ఐదు సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి అయిదు సంవత్సరాలు పాలించారని ఇద్దరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి రాజ్యాంగబద్ధంగా ఉంటామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడిపేశారని ఇద్దరూ పెద్దపెద్ద హామీలు ఇచ్చారని కానీ ప్రత్యేక హోదా సాధించలేక పోయారని నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని వారి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ని అడుగుతున్నామని ఏపీలో అన్ని జిల్లాల అభివృద్ధి కోసం పనిచేయాలని ఏపీకి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించాలని గుండ్రేవుల, తుంగభద్ర డ్యామ్ ల నిర్మాణాలు ఏమయ్యాయని, హైకోర్టు బెంచ్ ఏమైందని, స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, మోడీకి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించలేరని 10 సంవత్సరాల్లో బిజెపికి మద్దతు పలికిన పార్టీలను అధికార, ప్రతిపక్షాలను కోరుచున్నామని. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వ్యతిరేకిస్తే బిజెపి చతికిల పడుతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని, బిజెపి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారని మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని మోడీకి భయపడి పనిచేయాల్సిన అవసరం లేదని మీ ఎంపీలతో సహాయ నిరాకరణ ప్రకటించాలని సలహా ఇచ్చారు. మోడీ ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే శ్రీమతి వైయస్ షర్మిలమ్మ  నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారని ఉద్యోగాలు పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రానికి జీవధార ప్రత్యేక హోదా అని గాంధీ మార్గంలో సహాయ నిరాకరణ చేసిన రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని మోడీ ప్రభుత్వానికి మెలకువ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో బిజెపి ప్రభుత్వం దొంగనిద్ర నటిస్తుందని నిన్న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బిజెపి ఒక స్థానం దక్కించుకుందని ఇండియా కూటమి మిగతా స్థానాలు గెలుపొందని గతంలో ప్రత్యేక ప్యాకేజీతో సర్దుకున్నారని ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ప్రశ్నించాలని లేదంటే బాబు జగన్ పవన్  రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ఆటంకం కలిగించిన వారు అవుతారని హితవు పలికారు. కావున ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు  కాపాడాలని  కోరుతున్నామని శైలజానాథ్ గారు తెలియజేశారు. డిసిసి అధ్యక్షులు కే బాబురావు గారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అనంతరం విలేకరులకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, పిసిసి అధికార ప్రతినిధి బి చిన్న రామాంజనేయులు, జిల్లా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం మాదిగ, డిసిసి ఉపాధ్యక్షులు కే వెంకటరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు యన్ సి బజారన్న, రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి సి వెంకట రాముడు, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాద్రి బాషా, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం అబ్దుల్ హై ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు మొదలగు వారు పాల్గొన్నారు.

About Author