వైభవంగా భగవద్గీత కంఠస్థ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ శివారులోని జి పుల్లారెడ్డి నగర్ లోని విజ్ఞాన పీఠం లో ఈరోజు అనగా 7 డిసెంబర్ 2024వ తేదీ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని 30 పాఠశాలకు చెందిన 900 మంది విద్యార్థులతో గీతా జయంతి సందర్భంగా సామూహిక భగవద్గీత గానం జరిగింది. శ్రీమద్ భగవద్గీత ను మించిన గొప్ప మానసిక శాస్త్రం ఎక్కడ ఉండదని అన్నారు ఎవరైతే తమ మనస్సును నిగ్రహించుకుంటారో వారికి మనసు మిత్రుడు గా ఉంటుంది, నియంత్రించలేని మనసు శత్రువు అవుతుందని, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి అన్నారు . శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల సారమని విజ్ఞాన పీఠం అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణయ్య తెలియజేశారు. సభాధ్యక్షులుగా శ్రీ మాణిక్య రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులకు తరగతి వారీగా భగవద్గీతలోని పదవ అధ్యాయము శ్రీ విభూతి యోగములు కంఠస్త పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి తరగతిలో అత్యుత్తమంగా శ్లోకాలు తెలిపిన 12 మంది విద్యార్థులకు మొత్తం 100 బహుమతులను విద్యార్థులకు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మద్దిలేటి ఈపూరి నాగరాజు శ్రీమతి జంపాల రాధికారు చంద్రమోహన్ మాధవ స్వామి రామిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి శ్రీనివాసులు శ్రీ రణధీర్ రెడ్డి శ్రీమతి స్వర్ణలత శ్రీమతి రేణుక శ్రీ సుదర్శన్ రావు ఈ సోమయ్య శ్రీ వంశీ రాఘవ రాజశేఖరరెడ్డి శ్రీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.