వైభవంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి ధనుర్మాస ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవములు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము, వలనే ఈరోజు కుడారై సేవను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ప్రాతః కాలంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విగ్రహమునకు విశేష ద్రవ్యములతో అభిషేకం , అర్చనలు జరిగినవి. అనంతరం కుడారై ఉత్సవ సేవలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రీ సుదర్శన యంత్రం ఏర్పరిచి ఆవాహన మొదలగు షోడశోపచార పూజను చేసి 108 పాత్రలలో క్షీరాన్న నైవేద్యమును భక్తుల సమక్షమములో శ్రీ ఛాయా, ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నివేదించబడినది. అనంతరం మహా మంగళహారతి మంత్ర పుష్ప సమర్పణ కావించి భక్తులకు తీర్థ ప్రసాదమును వితరణ చేయడం జరిగినది. ఈ కుడారై సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామివారి కృపకు పాత్రులైనారు.