PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుల పని సర్దుబాటు కు ముందు జి ఓ 117 రద్దు చేయాలి : ఆప్టా 

1 min read

పల్లెవెలుగు వెబ్​  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ప్రస్తుతం ఉపాధ్యాయుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్ యాప్ లో టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరచాలని కోరడం ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ కోసమే అని అందరూ భావిస్తున్న ఈ సందర్భంగా గౌరవ మానవ వనరుల శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యక్షంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఆప్టా సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ జి ఎస్ గణపతి రావు కే ప్రకాష్ రావు పత్రిక ప్రకటనలో కోరారు, మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నారా లోకేష్ బాబు గారు మానవ వనరుల శాఖ మాత్యులుగా బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా వారు పాదయాత్రలో జీవో 117 ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుంచుకుంటారని అందరూ ఉపాధ్యాయులు భావించారు .కానీ ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు చేపడుతున్న చర్యలను బట్టి 117 జీవోని రద్దు చేయకుండానే ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ 117 జీవో ప్రాప్తికే జరుపుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది, ఇప్పటికే జీవో 117 వలన ప్రాథమిక పాఠశాలలు చాలావరకు మూత దశకు చేరుకున్నాయి ఇలాగే కొనసాగితే త్వరలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కూడా మూత దశకు చేరుకోవడం పెద్దగా ఆశ్చర్యపరిచే విషయం కాదని వారు తెలియజేశారు. కావున గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు తక్షణమే జి  ఓ 117 ను రద్దు చేసి రాష్ట్రంలోని  ఉపాధ్యాయ సంఘాల తో ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చించి ముందుకు వెళ్లాలని ఆప్టా నాయకులు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు ని లేఖ  పూర్వకంగా కోరటం జరిగింది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా కాలం లో పాఠశాలల్లో శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశించిన ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని జి ఓ 117 ద్వారా అశాస్త్రీయ పద్ధతుల్లో  మార్చడం ద్వారా  ఉపాధ్యాయులు సర్ ప్లస్ గా కనిపిస్తున్నారని కావున ముందు అశాస్త్రీయమైన ప్రభుత్వ ఉత్తర్వులు  రద్దు చెసిన తరువాత సంఘాలూ మరియు విద్యావేత్త లతో చర్చించిన తర్వాతే ఉపాధ్యాయుల పని సర్దుబాటు పక్రియ చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు.

About Author